కుర్ర హీరోతో బుట్టబొమ్మ పూజా హెగ్డే పీకల్లోతు ప్రేమలో ఉందన్న వార్త టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. తల్లిదండ్రులతో కలిసి డిన్నర్‌కు వెళ్లడంతో ఈ వ్యవహారం త్వరలో పెళ్లి పీటలెక్కనుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.

అశేష ప్రేక్షకాదరణతో టాలీవుడ్ 'బుట్టబొమ్మ'గా వెలుగొందిన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఇప్పుడు ఒక సరికొత్త న్యూస్‌తో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్నాళ్లుగా తన పర్సనల్ లైఫ్‌ను అత్యంత గోప్యంగా ఉంచుతున్న ఈ పాన్ ఇండియా భామ, ఇప్పుడు బాలీవుడ్ దివంగత నటుడు వినోద్ మెహ్రా కుమారుడు, కుర్ర హీరో రోహన్ మెహ్రాతో పీకల్లోతు ప్రేమలో ఉందనే వార్త నెట్టింట దావానలంలా వ్యాపిస్తోంది. ఏ సినిమా షూటింగ్ లో కూడా కలవని వీరు సీక్రెట్ గా ప్రేమాయణం సాగిస్తున్నారన్న లీక్స్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

పూజా, రోహన్ కలిసి ఏ సినిమాలో నటించకపోయినా ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఏర్పడిన పరిచయం కాస్తా ఇప్పుడు గాఢమైన ప్రేమగా మారిందని ఇన్‌సైడ్ టాక్. ముంబైలోని ఖరీదైన రెస్టారెంట్లు, పలు సినీ ఈవెంట్లలో ఈ జంట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ పదే పదే మీడియా కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు. ముఖ్యంగా గత ఏడాదే పూజా తల్లిదండ్రులతో కలిసి రోహన్ స్పెషల్ డిన్నర్‌కు వెళ్లడం, రీసెంట్ గా ఇద్దరూ ఒకే కారులో ముంబై వీధుల్లో షికార్లు కొట్టడం చూస్తుంటే వ్యవహారం త్వరలో పెళ్లి పీటల వైపు దూసుకుపోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి.

ఒకవైపు ఈ పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుండగానే, పూజా హెగ్డే కెరీర్ కూడా ప్యాన్ ఇండియా స్థాయిలో బిజీగా సాగుతోంది. దళపతి విజయ్ తో ప్రతిష్టాత్మక 'జన నాయగన్', వరుణ్ ధావన్ తో జూన్ 5న రాబోతున్న బాలీవుడ్ మూవీతో పాటు దుల్కర్ సల్మాన్ భారీ ప్రాజెక్టును కూడా లైన్లో పెట్టింది. "కుర్రాడు కత్తిలా ఉన్నాడు, బుట్టబొమ్మకు పర్ఫెక్ట్ మ్యాచ్" అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తుండగా.. ఈ స్టార్ హీరోయిన్ తన సీక్రెట్ లవ్ స్టోరీని అఫీషియల్ గా ఎప్పుడు ప్రకటిస్తుందా అని ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

Tags: pooja hegde dating rumors, rohan mehra and pooja hegde, tollywood actress pooja hegde, pooja hegde marriage news, bollywood actor rohan mehra, thalapathy 69 pooja hegde, pooja hegde latest news, tollywood gossip updates