'పెద్ది' సినిమా స్టోరీ లైన్ సోషల్ మీడియాలో లీక్ కావడంతో మెగా ఫ్యాన్స్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గ్లోబల్ స్టార్ ఇమేజ్‌కు ఈ సింపుల్ పాయింట్ సెట్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు టాలీవుడ్ హాట్ టాపిక్.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా మూవీ 'పెద్ది' కోసం మెగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అయితే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఆసక్తికరమైన న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమా స్టోరీ లైన్ సోషల్ మీడియాలో లీక్ కావడంతో టాలీవుడ్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. జూన్ 4న థియేటర్లలోకి రానున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్ అసలు కథ ఏంటని అభిమానులు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు.

లీకైన సమాచారం ప్రకారం, ఈ సినిమా 1980ల నాటి ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. రైల్వే స్టేషన్ ఉన్నా రైలు ఆగని ఒక పల్లెటూరి ఆత్మగౌరవం కోసం హీరో చేసే పోరాటమే 'పెద్ది' ప్రధానాంశం. ఈ పోరాటంలో క్రికెట్, కుస్తీ క్రీడలను చరణ్ తన ఆయుధాలుగా వాడుకోనున్నాడట. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఒక సాధారణ గ్రామీణ యువకుడి ఎమోషనల్ ప్రయాణాన్ని బుచ్చిబాబు తనదైన శైలిలో అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు ఇన్‌సైడ్ టాక్.

అయితే, ఇంత సింపుల్ స్టోరీ లైన్‌తో 'ఆర్ఆర్ఆర్' లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత చరణ్ రేంజ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా అని కొందరు అభిమానులు టెన్షన్ పడుతున్నారు. కానీ, బుచ్చిబాబు తన మునుపటి సినిమాలో చూపించిన ఎమోషనల్ డెప్త్ ఈ చిత్రంలో కూడా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. క్లైమాక్స్ లో వచ్చే 20 నిమిషాల యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి.

Tags: ram charan peddi movie, buchi babu sana director, peddi story line leak, ram charan upcoming movies, tollywood pan india films, janhvi kapoor peddi movie, peddi movie release date