దగ్గుబాటి ఫ్యామిలీ దానధర్మాలు చేయరనే విమర్శలకు నిర్మాత సురేష్ బాబు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. తండ్రి కోరిక కోసం ఏకంగా కోట్లు విలువ చేసే 35 ఎకరాల భూమిని వెంకటేష్ తో కలిసి ఎలా దానం చేశారో చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీ మొఘల్ రామానాయుడు వారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, అగ్ర నిర్మాత సురేష్ బాబు తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే, సోషల్ మీడియాలో దగ్గుబాటి ఫ్యామిలీ దానధర్మాలు చేయరని, ఛారిటీ కార్యక్రమాలకు దూరంగా ఉంటారని తరచుగా కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు. ఈ విమర్శల వెనుక ఉన్న నిజాన్ని బయటపెడుతూ సురేష్ బాబు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలు పంచుకున్నారు. ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
తమ తండ్రి రామానాయుడు గారికి వ్యవసాయం అంటే ఎంతో ఇష్టమని, ఆయన కోరిక మేరకు మెదక్ లో ఏకంగా 35 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చామని సురేష్ బాబు వెల్లడించారు. కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేయడానికి ఎవరో వచ్చి అడిగిన వెంటనే, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తమ్ముడు వెంకటేష్ తో కలిసి కోట్లు విలువ చేసే ఈ ల్యాండ్ ను దానం చేశారట. ఈ విషయం బయటకు రావడంతో వెంకీ మామ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కాలర్ ఎగరేస్తున్నారు. పబ్లిసిటీ లేకుండా ఇంత పెద్ద సాయం చేయడం కేవలం దగ్గుబాటి ఫ్యామిలీకే చెల్లిందని కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి ఒక చేత్తో చేసిన సాయం మరో చేతికి తెలియకూడదు అనే సిద్ధాంతాన్ని వెంకటేష్, సురేష్ బాబు ఫాలో అవుతుంటారు. రామానాయుడు మున్సిపల్ స్కూల్ మొదలుకొని ఎన్నో సేవా కార్యక్రమాలను వారు గుట్టుచప్పుడు కాకుండా చేస్తూనే ఉన్నారు. పాన్ ఇండియా స్థాయిలో టాలీవుడ్ మార్కెట్ పెరుగుతున్న ఈ రోజుల్లో, ఇలాంటి స్టార్ హీరోలు సైలెంట్ గా చేసే ఛారిటీలు ఇతర నటీనటులకు ఆదర్శంగా నిలుస్తాయి. పబ్లిసిటీ కోసం వెంపర్లాడకుండా రైతుల కోసం ఇంతటి భారీ భూమిని దానం చేసిన దగ్గుబాటి బ్రదర్స్ రియల్ లైఫ్ లోనూ మాస్ హీరోలే అని నిరూపించుకున్నారు!