బ్లాక్ బస్టర్ చందమామ సినిమా నుంచి కృష్ణవంశీ తనను ఎందుకు తీసేశాడో అడివి శేష్ బయటపెట్టాడు. డెకాయిట్ సక్సెస్ మీట్‌లో బయటపడిన ఈ చేదు నిజం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మినిమమ్ గ్యారంటీ హీరోగా, పాన్ ఇండియా స్టార్‌గా అడివి శేష్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి సినిమాతో ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేసే ఈ స్టార్ హీరో కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఒక చేదు అనుభవం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ 'చందమామ' సినిమా నుంచి శేష్‌ను షూటింగ్ మొదలైన మూడు రోజులకే పీకేశారు. ఈ విషయాన్ని స్వయంగా శేష్ తన తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా కంగుతిన్నారు.

అప్పట్లో 'మల్లెపువ్వు' అనే వర్కింగ్ టైటిల్‌తో మొదలైన ఈ ప్రాజెక్ట్‌లో ఎంటీవీ వీజే క్యారెక్టర్ కోసం 15 ఏళ్ల వయసున్న శేష్‌ను సెలెక్ట్ చేశారు. అయితే మూడు రోజుల షూటింగ్ తర్వాత, ఈ కుర్రాడు ఆ క్యారెక్టర్‌కు సెట్ అవ్వడం లేదని కృష్ణవంశీ ప్రాజెక్ట్ నుంచి తప్పించారట. ఆ తర్వాతే ఆ క్యారెక్టర్‌లోకి నవదీప్ ఎంట్రీ ఇచ్చాడు. సడెన్‌గా సినిమా నుంచి తీసేయడంతో అప్పట్లో తనకు ఏమీ అర్థం కాలేదని, కనీసం గడ్డం కూడా రాని వయసులో ఆ రిజెక్షన్ ఎదుర్కొన్నానని శేష్ ఎమోషనల్ అయ్యాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ హాష్‌ట్యాగ్‌గా మారాయి.

ఒకప్పుడు రిజెక్ట్ చేసిన ఇండస్ట్రీయే ఇప్పుడు అడివి శేష్ డేట్స్ కోసం క్యూ కడుతుండటం టాలీవుడ్‌లో ఆయన రేంజ్‌ను చూపిస్తోంది. ఏప్రిల్ 10న థియేటర్లలోకి వచ్చిన 'డెకాయిట్' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఓటీటీ రిలీజ్ రైట్స్ కోసం కూడా గట్టి పోటీ నెలకొంది. పదేళ్ల క్రితం ఆఫీసుల చుట్టూ తిరిగిన ఆ కుర్రాడే, నేడు తన మార్కెట్ స్టామినాతో ఇండస్ట్రీని శాసిస్తున్నాడు. డెకాయిట్ ప్రమోషన్స్‌లో శేష్ చెప్పిన ఈ ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ.. ఎంతో మంది యంగ్ యాక్టర్స్‌కు ఒక ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది.

Tags: adivi sesh dacoit interview, krishna vamsi chandamama movie, adivi sesh rejected movies, tollywood actor adivi sesh, navdeep chandamama adivi sesh, futureandhra tollywood news, adivi sesh pan india star