రోజంతా కష్టపడే సామాన్యులకు వయసు మీద పడ్డాక ఆర్థిక భరోసా కల్పించే అత్యుత్తమ ప్రభుత్వ పథకం ఇది. రోజుకు కేవలం 7 రూపాయలు పక్కన పెడితే రిటైర్మెంట్ తర్వాత ప్రతి నెలా 5000 చేతికి వస్తాయి, వెంటనే వయసువారీ లెక్కలు తెలుసుకోండి.
చిన్న వయసులోనే ప్లాన్ చేస్తేనే.. మనం సంపాదించేది ఎంతైనా, వయసు మీద పడ్డాక చేతిలో డబ్బు లేకపోతే వచ్చే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలో పొలాల్లో పనిచేసే రైతులు, భవన నిర్మాణ కార్మికులు, చిరు వ్యాపారులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు. అందుకే కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన (APY) ద్వారా నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు గ్యారెంటీ పెన్షన్ అందిస్తోంది. కూరగాయల ఖర్చులో రోజుకు కేవలం 7 రూపాయలు పక్కన పెడితే చాలు, మీ వృద్ధాప్యం సురక్షితం అవుతుంది.
ఏ వయసులో ఎంత కట్టాలి?
మీరు చెల్లించే ప్రీమియం మీ వయసుపై ఆధారపడి ఉంటుంది. 18 ఏళ్ల వయసులో ఈ స్కీమ్‌లో చేరితే, నెలకు రూ.5000 పెన్షన్ కోసం మీరు కట్టాల్సింది కేవలం రూ.210 మాత్రమే. అదే 30 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ.577, 40 ఏళ్ల వయసులో చేరితే నెలకు రూ.1454 చొప్పున 60 ఏళ్లు వచ్చే వరకు చెల్లించాలి. మీరు బ్యాంకు ఖాతాకి ఆటో డెబిట్ ఇస్తే చాలు, ప్రతినెలా కట్ అవుతుంది. ఈ స్కీమ్ ద్వారా ఖాతాదారుడికి, ఆ తర్వాత జీవిత భాగస్వామికి కూడా జీవితాంతం గ్యారెంటీగా పెన్షన్ వస్తుంది.
నామినీకి రూ.8.50 లక్షల బహుమతి
ఈ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ (PFRDA) నిర్వహిస్తున్న ఈ పథకంలో మరో అద్భుతమైన ప్రయోజనం ఉంది. ఖాతాదారుడు, జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించిన తర్వాత, నామినీకి ఒకేసారి రూ.8.50 లక్షలు అందుతాయి. మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ప్రభుత్వం కనీస పెన్షన్‌కు గ్యారెంటీ ఇస్తుంది కాబట్టి ఎటువంటి భయం లేదు. మీరు వెంటనే మీ దగ్గర్లోని బ్యాంకు లేదా పోస్టాఫీసుకి వెళ్లి మీ ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలతో అటల్ పెన్షన్ యోజనలో చేరి మీ కుటుంబ భవిష్యత్తును కాపాడుకోండి.