మీర్జాపూర్ సిరీస్ తో దేశాన్ని వణికించిన మున్నా భయ్యా ఇప్పుడు టాలీవుడ్ పై కన్నేశాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, విక్టరీ వెంకటేష్ లతో పాన్ ఇండియా రేంజ్ లో రెడీ అవుతున్నాడు.
బాలీవుడ్ వెబ్ సిరీస్ మీర్జాపూర్‌లో తన ఆటిట్యూడ్ తో దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన మున్నా భయ్యా.. అదేనండీ మన దివ్యేందు శర్మ ఇప్పుడు టాలీవుడ్ పై ఫోకస్ పెట్టాడు. పాన్ ఇండియా మార్కెట్ ను టార్గెట్ చేస్తూ వరుసగా క్రేజీ ఆఫర్స్ పట్టేస్తున్నాడు. తెలుగు ప్రేక్షకుల్లో తనకు ఉన్న సాలిడ్ ఫ్యాన్ బేస్ చూసి ఆశ్చర్యపోయిన ఈ స్టార్ విలన్, భాష రానందుకు సిగ్గు పడుతూ నెమ్మదిగా తెలుగు నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సీక్రెట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న 'పెద్ది' సినిమాలో దివ్యేందు పవర్ఫుల్ నెగెటివ్ పాత్రలో కనిపించనున్నాడు. జూన్ 4న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. ఈ మాస్ ఎంటర్టైనర్ రిలీజ్ కాకముందే ఆయనకు మరో బంపర్ ఆఫర్ తగిలింది. విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న 'ఆదర్శ కుటుంబం - ఏకే 47' లో ఆయన ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు స్వయంగా కన్ఫర్మ్ చేశాడు. ఇందులో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
టాలీవుడ్ లో కొత్త విలన్ల కొరత తీవ్రంగా ఉన్న ఈ టైమ్ లో, మున్నా భయ్యా ఎంట్రీ ఇండస్ట్రీకి పెద్ద బూస్ట్ అని చెప్పాలి. ముఖ్యంగా హారిక అండ్ హాసిని బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న సినిమాలో ఛాన్స్ రావడం మామూలు విషయం కాదు. థమన్ మ్యూజిక్, రవి కె. చంద్రన్ విజువల్స్ తో తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ డ్రామా ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. త్వరలోనే పెద్ది ట్రైలర్ రిలీజ్ కానుండగా, చరణ్ మరియు మున్నా భయ్యా ముఖాముఖి సీన్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.