రిపోర్టర్: FutureAndhra News Desk | వర్గం: వినోదం
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఓ అద్భుత చిత్రం అసలు తెరపైకి రాలేదు. ఆగిపోయిన ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ 'సత్యాగ్రహి' వెనుక అసలు కథేంటో తెలుసుకోండి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కలల ప్రాజెక్ట్ 'సత్యాగ్రహి' గురించి ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. సమాజంలోని అన్యాయాలపై గళమెత్తే స్టూడెంట్ లీడర్ పాత్రతో, పవన్ స్వయంగా దర్శకత్వం వహించాలనుకున్న ఈ సినిమా కథకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ప్రాజెక్ట్ అగిపోవడం టాలీవుడ్ లో ఒక మిస్టరీగా మిగిలిపోయింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
'జానీ' తర్వాత పవన్ తనలోని ఆలోచనలకు పదునుపెట్టి, దాదాపు మూడేళ్లు శ్రమించి 'సత్యాగ్రహి' స్క్రిప్ట్ సిద్ధం చేశారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించాల్సి ఉన్నా, భారీ బడ్జెట్ తో ఏ.ఎం. రత్నం ముందుకు వచ్చారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం, తెలుగు, హిందీల్లో నిర్మాణం అంటూ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. దాసరి, వెంకటేష్, అల్లు అర్జున్ వంటి ప్రముఖుల సమక్షంలో ప్రారంభోత్సవం కూడా ఘనంగా జరిగింది.
అయితే, ఊహించని కారణాలతో, ప్రాజెక్ట్ బడ్జెట్ విపరీతంగా పెరిగిపోవడంతో నిర్మాత నష్టపోకూడదనే ఉద్దేశంతో పవన్ ఈ చిత్రాన్ని పక్కన పెట్టారు. 2013, 2017ల్లో ప్రయత్నించినా, పవన్ రాజకీయాల్లోకి వెళ్లడంతో అది సాధ్యం కాలేదు. ఈ 'సత్యాగ్రహి' విడుదలై ఉంటే, యువతలో పవన్ క్రేజ్ తో ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యేదని అభిమానులు ఇప్పటికీ భావిస్తారు.