రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూంలో ఈ-సిగరెట్ తాగుతూ దొరికిపోయాడు. చట్టపరమైన సమస్యతో పాటు ఏడాది జైలు శిక్ష పడే ప్రమాదం! బీసీసీఐ కఠిన చర్యలకు యోచిస్తోంది. ఆటగాళ్ల బాధ్యతారాహిత్యంపై దుమారం.
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ జరుగుతుండగా, రాజస్థాన్ రాయల్స్ డ్రెస్సింగ్ రూమ్ లో కెమెరాలు రియాన్ పరాగ్పైనే పడ్డాయి. ప్రత్యక్ష ప్రసారంలో అతను ఈ-సిగరెట్ తాగుతున్న దృశ్యాలు బయటపడ్డాయి. ఇది ఆటగాళ్ల బాధ్యతారాహిత్యాన్ని మరోసారి బయటపెట్టింది.
భారత ప్రభుత్వం 2019లో ఈ-సిగరెట్లను నిషేధించింది. దీని ప్రకారం, బహిరంగంగా వాడితే ఏడాది వరకు జైలు శిక్ష లేదా లక్ష రూపాయల జరిమానా పడే అవకాశం ఉంది. ఒక బాధ్యతాయుతమైన కెప్టెన్‌గా పరాగ్ ఇలా చేయడంపై బీసీసీఐ ఆగ్రహంతో ఉంది.
ఈ ఘటన రాజస్థాన్ జట్టుకు కొత్త తలనొప్పిగా మారింది. ఇప్పటికే టీమ్ మేనేజర్ ఫోన్ వాడకంపై జరిమానా ఎదుర్కొంది. పరాగ్ ప్రవర్తనపై షోకాజ్ నోటీసులకు ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడాలి. అతని కెరీర్‌పై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో కాలమే నిర్ణయిస్తుంది.