రోహిత్ శర్మ క్రికెట్ ప్రయాణం ఓ వింత మలుపుతో మొదలైంది. బ్యాటింగ్ లైన్ చూసి పారిపోయిన పిల్లాడు.. నేడు భారత క్రికెట్ దిక్సూచి!

అంతర్జాతీయ క్రికెట్లో 50 సెంచరీలు, 20 వేలకు పైగా పరుగులు! కానీ ప్రపంచం మెచ్చిన ఓపెనర్‎గా వెలుగుతున్న రోహిత్, కెరీర్ ఆరంభంలో బ్యాటింగే వద్దనుకున్నాడన్న నిజం చాలామందికి తెలియదు. 30 ఏప్రిల్ 2026న 39వ వసంతంలోకి అడుగుపెట్టిన ఈ ముంబై ఇండియన్స్ కెప్టెన్ క్రికెట్ ప్రయాణం వెనుక ఒక ఆసక్తికరమైన కథ దాగి ఉంది.

సెలక్షన్లకు వెళ్ళినప్పుడు బ్యాటింగ్ కోసం పొడవైన క్యూ లైన్ చూసి రోహిత్ విసుగు చెందాడు. ఆ వేడిలో నిలబడలేక, పక్కనే తక్కువ మంది ఉన్న బౌలింగ్ లైన్ లోకి వెళ్లి నిలబడ్డాడు. అలా ఆఫ్ స్పిన్నర్‎గా మొదలైన అతని ప్రయాణం, కోచ్ దినేష్ లాడ్ దృష్టిని ఆకర్షించింది. బౌలింగ్ లో ప్రతిభ గుర్తించిన లాడ్, స్కూల్ తరఫున ఆడమని ఆహ్వానించాడు.

ఆల్ రౌండర్ అవసరం రావడంతో బ్యాటింగ్ అవకాశం దక్కింది. ఓపెనర్‎గా కొన్ని పరుగులు చేయగానే, రోహిత్ లోని అసలైన బ్యాటర్ ప్రపంచానికి తెలిశాడు. అప్పటి నుంచి బంతిని బాదడం మొదలుపెట్టిన రోహిత్, మిడిల్ ఆర్డర్ నుండి ఓపెనర్‎గా మారి, మూడు డబుల్ సెంచరీలతో భారత క్రికెట్‎కు దిక్సూచిగా నిలిచాడు.

Tags: Rohit Sharma career journey, Rohit Sharma early life, cricket player secrets, Indian cricket captain, Rohit Sharma batting, Rohit Sharma bowling, cricket selection story, FutureAndhra sports